- గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.
- పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్ సెల్స్‌కు చెక్ పెట్టవచ్చు.
- వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.
- బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
- ఇంకా నాణ్యత గల స్లిపర్స్, షూస్ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు.
- అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.
- రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.