- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది.
- గిన్నెలో నీళ్లు మసలపెట్టి ఆవిరిని ముఖానికి పట్టడం హితకరం. ఈ ఆవిరి 8-10 నిమిషాలు పడితే చాలు.
- వేపపూలు చూర్ణించిన ముద్దలో కొంచెం పసుపు, వెన్నపూస కలిపి పొక్కులపై రాసి గంట తరువాత కడిగి వేయండి. మంచి ఫలితం ఉంటుంది.
- కాకరకాయని మధ్యలో చీల్చి, చీల్చిన తెల్లనిభాగంతో చర్మంపై సున్నితంగా రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
- పోకచెక్క నీళ్లతో గంధం తీసి ముఖానికి పట్టించి మూడు గంటల తర్వాత కడిగేసుకోవాలి.
- ఉసిరిక వలుపు, తమలపాకుపై రాసుకునే కాచు కలిపి దానిలో బాదంపాటు కలిపి చూర్ణం చేసి పావు చెంచా చొప్పున తీసుకుంటే తెల్లని మచ్చలు పోతాయి.
- పాలమీగడలో పసుపు, పొట్లకాయ, పైపొట్టు, నువ్వులు కలిపి ముఖానికి రాసుకుంటే అన్ని మొటిమలు పోయి ముఖం అందంగా తయారవుతుంది.