1. గోరువెచ్చని కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్ళకు పట్టించి మర్దన చేయాలి.
2. టర్కీటవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టండి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి.
3. శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తడిజుట్టుకు కండిషనర్‌ని రాయండి. అయితే మాడుకు కండిషనర్‌ని తగలనివ్వద్దు.
4. జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయర్‌ని ఉపయోగించవద్దు. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. జుట్టు తడిని టవల్ పీల్చుకుని, పొడిగా అవుతుంది.
5. పార్టీలకో, బయటకు వెళ్ళినప్పుడో జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
6. ప్రయాణాలలో కిటికీ దగ్గర కూర్చుంటే తలకు స్కార్ఫ్ కట్టుకోవాలి. గాలికి జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దుమ్ముకూడా అంటదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.