టీస్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్, అరటీస్పూన్ కార్న్ పౌడర్ కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా, కాంతివంతముగా చేస్తుంది.
0 Comments
కొబ్బరి నూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మర్దన చేయాలి. రోజులో కొన్ని సార్లు చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ళ సమస్యలు తగ్గి మృదువుగా అవుతాయి.
పెదవులు నల్లగా ఉంటే..
కొద్దిగా వెన్న తీసుకొని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు లేక నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి. చెరుకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాయాలి. వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ విధముగా రొజూ చేస్తే చర్మం ముడతలు తగ్గుతుంది.
అరకప్పు బియ్యప్పిండితో బొప్పాయి పండు గుజ్జు, ఒక చెక్క నిమ్మరసం పిండి, పేస్ట్ లా చేయాలి. దీనిని ముఖానికి మెడకు పట్టించి పదినిమిషాల తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే ముఖం, మెడ శుభ్రంగా, తాజాగా కనిపిస్తాయి.
కార్న్ ఫ్లెక్స్ ను పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి రబ్ చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
ముల్తానీ మట్టి, తేనె, బొప్పాయి పండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతముగా కనిపిస్తుంది.
అరటిపండు గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిల్లా ఎక్ష్ ట్రాక్ట్ కలిపి మేనికి రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.
విటమిన్ 'ఇ' ఆయిల్ లో మూడు చుక్కల నిమ్మరసం, అరటీస్పూన్ గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది.
తేనె, చక్కెర సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి కళ్ళ చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతో పాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్ మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
|