బ్లాక్ హెడ్స్ వస్తున్న చోట టొమాటో ముక్కతో బాగా రుద్ది ఐదు నిముషాలు వదిలేయాలి. తరవాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రపడుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్యా ఎదురవదు. టొమాటోలో ఉండే విటమిన్ 'ఎ','సి','కె' లు మొటిమలు రాకుండా నిరోధిస్తాయి.
0 Comments
టొమాటో గుజ్జుకి కొంచెం పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఎండా ప్రభావంవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. కొందరిలో దగ్గర నుంచి చూస్తే చర్మ రంద్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి వారు టొమాటో గుజ్జుకి కొంచెం నిమ్మరసం కలిపి రాసుకుంటే మంచిది.
ఎండకి వడలిపోయిన చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలాంటపుడు కప్పు కొబ్బరిపాలు, అరకప్పు రోజ్ వాటర్ కలిపి ఒక బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఎండలోకి వెళ్లి రాగానే ఆ మిశ్రమాన్ని ముఖంఫై చిలకరించుకొని అరగంట పాటు ఉండండి. ఎండకి ఎర్రగా మారిన చర్మం మళ్లీ మామూలు స్థితికి రావడంతో పాటు టాన్ కూడా తగ్గుతుంది.
రెండు స్పూన్ల కొబ్బరి పాలకి, నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కలిపి ఒక డబ్బాలో వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. దీనిని వారం రోజుల పాటు మేకప్ రిమూవర్ లా వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే రిమూవర్ లా కన్నా ఈ మిశ్రమం ముఖాన్ని బాగా శుభ్రం చేస్తుంది.
చర్మాన్ని శుభ్రపరచుకోవడానికి కొబ్బరి పాలతో క్లెన్సర్ ను తయారుచేసుకోవచ్చు. కొబ్బరి పాలకి, మెత్తటి పెరుగుని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఐదు నిమిషాల పాటు వదిలేసి తడి వస్త్రముతో మృదువుగా తుడవండి. తరవాత చల్లని నీటిని ముఖంఫై చల్లుకొని కడిగేసుకోండి. చర్మంఫై పట్టిన మృతకణాలు, మురికి పోతాయి.
|