రెండు టీస్పూన్ల క్యారెట్ తురుము, టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసేన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. లా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
0 Comments
చెరుకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాయాలి. వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ విధముగా రొజూ చేస్తే చర్మం ముడతలు తగ్గుతుంది.
కార్న్ ఫ్లెక్స్ ను పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి రబ్ చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
ముల్తానీ మట్టి, తేనె, బొప్పాయి పండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతముగా కనిపిస్తుంది.
తేనె, చక్కెర సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి కళ్ళ చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతో పాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్ మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం ముక్కలు 5, ఆముదం గింజలు 5, జీడి ఆకుల రసం 10 గ్రా., ఆవనూనె 20 గ్రా. కలిపి నూరుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే శరీరం అందంగా తయారవుతుంది.
శరీరంపై అధికంగా చెమటపడుతుంటే కరక్కాయ పెచ్చులను నీటితో నూరి ఒంటికి నలుగుపెట్టుకోండి. చెమట తగ్గి చర్మం చక్కగా ఉంటుంది. అలాగే సునాముఖి చూర్ణంను అరకప్పు ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ తాగుతుండాలి.
ఉడికించిన బంగాళాదుంప గుజ్జును, మరిగించిన పాలలో వేసి మెత్తని పేస్ట్ లా వేసుకుంటే చర్మం కాంతివంతముగా మారుతుంది. పొడిబారే సమస్యే ఉండదు.
రెండు అరటి పండ్లను గుజ్జులా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, మూడు చెంచాల తేనె వేసి బాగా కలిపి ముఖానికి పూతల రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది.
ఈ చర్మతత్వం ఉన్న వారి ముఖం తయారైనా కొన్ని నిమిషాలకే జిడ్డుకారుతుంది. ఇలాంటి వారు టొమాటో రసానికి కొంచెం కీరదోస రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మంఫై నూనె ఉత్పత్తి తగ్గడంతో పాటూ మొటిమల సమస్య కూడా రాదు.
|