- పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్టును చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.ఇలా చేస్తే నిగనిగాలాడే చర్మం మీ సొంతం.
- ఒక టమాటోను గ్రైండ్ చేసి 3చుక్కల నిమ్మరసం కలిపి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజుల పాటు ఉదయం, సాయంత్రం చేయాలి.
- ఒక కప్పు వెనిగర్లో కప్పు నీళ్లుపోసి పలుచబరిచి చర్మానికి పట్టించాలి.
- పచ్చి బంగాళాదుంపను గ్రైండ్ చేసి రసం తీసి దానికి నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించాలి.