కంద-పావుకిలో,
పెరుగు-రెండు కప్పులు
ఉప్పు-తగినంత,
పచ్చిమిర్చి-నాలుగు
ఎండుమిర్చి-నాలుగు,
నూనె-మూడు చెంచాలు
పోపుగింజలు-సరిపడినంత,
పసుపు-చిటికెడు
కరివేపాకు-రెండు రెబ్బలు,
కొత్తిమీర -కొద్దిగా
తయారుచేసే విధానం
- ముందుగా కందను చెక్కు తీసి ముక్కలుగా కోసి కడిగి ఉడికించాలి. తరువాత చల్లారనిచ్చి మెత్తని గుజ్జుగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
- ఓ గిన్నెలోకి పెరుగు తీసుకుని దానిలో పసుపు, ఉప్పుతో పాటు గుజ్జుగా చేసుకున్న కందను కూడా వేసి బాగా కలియతిప్పాలి.
- ఇప్పుడు బాణలిలో పోపుగింజల్ని వేయించుకుని పెరుగులో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగిపైన చల్లుకుంటే రుచిగా ఉంటుంది. ఇది అన్నం,చపాతీల్లోకి బాగుంటుంది.