టొమాటో ముక్కలు- 2 కప్పులు;
పండుమిర్చి ముక్కలు - 1/2 కప్పు;
జీలకర్ర పొడి - టీ స్పూన్;
పసుపు - 1/4 టీస్పూన్;
మెంతిపొడి - 1/4 టీ స్పూన్;
ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ చొప్పున;
కరివేపాకు - 1 రెమ్మ;
ఉప్పు - తగినంత;
నూనె - 3 టీ స్పూన్లు;
తయారి:
- మిక్సీలో టొమాటో ముక్కలు, పండుమిర్చి ముక్కలు వేసి మెత్తగా చేయాలి.
- బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, రుబ్బిన టొమాటో, మిర్చి మిశ్రమాన్ని వేయాలి. మూతపెట్టి నిదానంగా ఉడికించాలి.
- నీరంతా ఇగిరిపోయి, చిక్కబడుతున్నప్పుడు జీలకర్ర పొడి, మెంతిపొడి, కారం పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి. ఈ పచ్చడి మూడు రోజులు నిలువ ఉంటుంది.