క్యాప్సికం - 5,
కారం - ఒక టీ స్పూన్,
మెంతులు - పావు టీ స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్
పసుపు - కొద్దిగా,
ఇంగువ - కొంచెం,
నిమ్మకాయలు - 2,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- క్యాప్సికంను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేయించాలి. దీంట్లోనే కారం, పసుపు, ఇంగువ వేసి కలపాలి.
- ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. మధ్య, మధ్యలో రెండుమూడు సార్లు కలపాలి.
- ముక్క ఉడికితే దించేసి కాసేపు చల్లారనివ్వాలి. దీంట్లో నిమ్మరసం కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి.
- గాలి తగలకుండా మూత పెట్టేయాలి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.