చిక్కుడుకాయలు - కిలో;
పప్పు నూనె - పావు కిలో;
కారం - 100 గ్రా;
ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ;
ఆవపిండి - 100 గ్రా;
మెంతులు - టేబుల్ స్పూను;
చింతపండు - పావుకిలో
తయారి:
- చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి
- బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి
- ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి
- వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి
- చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి
- ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది)