చింతపండు-పావుకేజి,
బియ్యం-కేజి
ఎండుమిరపకాయలు-10,
పల్లీలు-100గ్రా.
పచ్చిమిరపకాయలు-10,
కరివేపాకు-కొద్దిగా
తాలింపుగింజలు-కొద్దిగా,
నూనె, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం :
ముందుగా చింతపండును గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి గుజ్జుగా తీసుకోవాలి. అన్నం విడిగా కొద్దిగా పలుకుగా వండుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి తాలింపుగింజలు, ఎండుమిరపకాయలు, పల్లీలు మొదలగువాటితో తాలింపు వేసుకుని అవి వేగాక చింతపండు గుజ్జును అందులో వేయాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పును వేసి సిమ్లో ఉడికించుకోవాలి. గుజ్జు దగ్గర పడుతున్నప్పడు పచ్చిమిరపకాయలను వేస్తే కారం బాగా పడుతుంది.బాగా గుజ్జు దగ్గరయ్యాక దించుకుని అన్నంలో కలుపుకోవాలి. ఇంగువ వాసన కావాలనుకునే వారు పులుసు ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది.
మూలం : వార్త దినపత్రిక