బాస్మతి రైస్ - 2 కప్పులు
గుడ్లు - 3
ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచిగా తగినంత
మిరియాల పొడి - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లికాడల తరుగు - ఒక కప్పు
నూనె - 1 టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో గుడ్లసొన, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో వేసి దోరగా వేగాక ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు (పెద్ద మంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, మిగిలిన మిరియాల పొడి వేయాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి వేడివేడిగా తినాలి.