బియ్యం - ఒక గ్లాస్
పెసర పప్పు - ఒక గ్లాస్
క్యారెట్ - ఒకటి
బంగాళదుంప - ఒకటి (చిన్నది )
చిక్కుళ్ళు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
అల్లం ముక్క - చిన్నది
ఆవాలు - కొంచెం
జీలకర్ర - కొంచెం
నీళ్ళు - ఐదు గ్లాసులు
నెయ్యి - కొంచెం
నూనె - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా
యాలక్కాయ - ఒకటి
పులావ్ ఆకులు - రెండు
తయారుచేసే పద్ధతి :
చిన్న కుక్కరుగాని, కుక్కరుపాన్ గానీ తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. కొంచెం వేగినాక బంగాళదుంప, క్యారెట్, చిక్కుడు పెద్ద ముక్కలుగా తరిగి వెయ్యాలి. అవి బాగా వేగాక బియ్యం, పప్పు కలిపి కడిగి నీరు ఓంపినాక వేయాలి. బాగా కలుపుతూ ఉప్పు, పసుపు వేసి యలక్కాయని చితక్కొట్టి వెయ్యాలి. అలా ఐదు నిమిషాలదాకా బాగా కలుపుతూ ఉంటే మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు మనం కొలిచి పెట్టుకున్న నీటిని ఇందులో పోసి బాగా కలిపి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి. అరగంట పోయాక కుక్కర్ ఓపెన్ చేసి నెయ్యి వేసి బాగా కలపాలి. భోగ్ రెడీ. దీన్ని బెంగాలీలు దేవీ నవరాత్రులలో అమ్మవారికి నివేదన చేసి నవరాత్రుల పందిళ్ళలో పంచుతారు.
ధనియా చట్నీ :
రెండు కొత్తిమీర కట్టలు, రెండు చిన్న టొమాటోలు, మూడు పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీ చేసి పక్కన పెట్టుకొని గీలీ కిచిడిలో తింటే చాలా బాగుంటుంది. మరి ఇంక ఐటమ్స్ అవసరం లేదు కూడా..
మూలం : ఆంద్రభూమి సచిత్ర మాస పత్రిక