telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

నిమ్మకాయ పులిహోర 

4/30/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బియ్యం                 :           ఒక కిలో
నిమ్మకాయలు       :           4
పచ్చిమిర్చి            :           12
ఎండుమిర్చి           :           6
కరివేపాకు             :           2 రెబ్బలు
పల్లీలు                  :           100 గ్రాములు
తాలింపు గింజలు  :            ఒక స్పూన్
పసుపు                :            చిటికెడు
ఉప్పు                  :            తగినంత

తయారుచేసే పద్ధతి :

          ముందుగా అన్నం కాస్త పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం తీసి, అందులో ఉప్పు వేసి అన్నంలో పోసి బాగా కలుపుకోవాలి. తరవాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసి పల్లీలు, పసుపు, తాలింపు గింజలు, పచ్చి మిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీనికి అన్నంను బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే నిమ్మకాయ పులిహోర రెడీ...

మూలం : ఆదివారం ఆంధ్రప్రభ
0 Comments

కొబ్బరి అన్నం 

4/29/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు:

బియ్యం               :           కిలో
కొబ్బరి కోరు        :          ఒక కప్పు  
ఎండుమిర్చి         :           2 (తరిగి పెట్టుకోవాలి)
పచ్చి మిర్చి         :           4(తరిగి పెట్టుకోవాలి)
కరివేపాకు           :           2 రెబ్బలు
తాలింపు గింజలు :            ఒక స్పూన్
నూనె                 :           ఒక కప్పు
పసుపు              :           చిటికెడు
ఉప్పు                 :           తగినంత

తయారుచేసే పద్ధతి:

 అన్నం కాస్త పలుకుగా వండి, దానికి తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసి కాగాక తాలింపు గింజలు, మిర్చి, కొబ్బరి కోరు, పసుపు వేసి వేగినాక కరివేపాకు చిటపటలాడిచ్చి అన్నంలో వేసి కలిపితే సరి... వేడివేడిగా కొబ్బరి అన్నం సిద్దం.

మూలం : ఆదివారం ఆంధ్రప్రభ
0 Comments

దొండకాయ అన్నం ...

4/26/2013

0 Comments

 
కావలసిన పదార్ధాలు :

బాసుమతి బియ్యం    :         రెండు కప్పులు (ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయ                 :        పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
నూనె                       :         తగినంత
నెయ్యి                      :         కొద్దిగా
అల్లం వెల్లుల్లి  ముద్ద  :          టేబుల్ స్పూను
గరం మసాలా           :          కొద్దిగా
కొబ్బరి పొడి             :           స్పూను
ధనియాల పొడి         :         టేబుల్ స్పూను
జీలకర్ర  పొడి            :         పావు టేబుల్ స్పూను
కారం పొడి               :         టేబుల్ స్పూను
పసుపు                   :        చిటికెడు
దొండకాయలు          :         పావు కేజీ (పొడవుగా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి )
ఉప్పు                      :         రుచికి సరిపడ
నిమ్మరసం               :         టేబుల్ స్పూను
కొత్తిమీర                  :         కొద్దిగా
పూదీన                    :          కొద్దిగా
పచ్చిమిరపకాయలు :         రెండు లేదా మూడు


తయారీ విధానం :

            మందపాటి గిన్నె లేదా బాండి తీసుకొని నూనె, నెయ్యి సమానముగా తీసుకొని కాగిన తర్వాత  దొండకాయ ముక్కలు వేసి సన్నని సేగన బాగా మగ్గించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనె లో మసాల దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి  ముద్ద, కొత్తిమీర, పూదీన జత చేయాలి. ఇవి వేగిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసి కొద్ది సేపు వేయించుకోవాలి. ఇవన్ని వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అన్ని బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పొయ్యి నుంచి దింపేయాలి. రెడీ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.

మూలము : నవ్య



0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    వెజ్ దమ్ బిర్యానీ
    ములగ ఆకులు
    మెంతి పులావు
    టమాటా పలావ్‌
    పల్లీ ఫ్రైడ్ రైస్
    వంకాయ వెల్లుల్లి మసాలా రైస్
    గుడ్లు
    పొంగల్
    కిచిడీ
    ఫ్రైడ్ రైస్
    బీరకాయ రైస్
    పుదీనా పలావు
    బీరకాయ రైస్
    శెనెగల రైస్
    టొమాటో పులావ్
    పుదీనా పన్నీర్ పలావ్
    దొండకాయ
    కొబ్బరి
    పులిహోర
    పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్
    కార్న్‌ కోకోనట్‌రైస్‌
    నిమ్మకాయ
    ప్రొటీన్ పులావ్
    గార్లిక్ ఫ్రైడ్ రైస్
    ఉసిరికాయ పులిహోర
    కాశ్మీరీ బిర్యానీ
    మష్రుమ్స్
    బీట్‌రూట్
    బేబీకార్న్
    కాలీఫ్లవర్ పులావ్
    బేబీకార్న్ పులావ్
    మొక్కజొన్న పులావ్
    చింతచిగురు పులిహోర
    మీల్‌మేకర్ బిర్యానీ

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.