బాస్మతి రైస్ - రెండు కప్పులు
పచ్చి బటాణి - ఒక కప్పు
బిర్యాని ఆకులు - మూడు
పచ్చిమిర్చి - నాలుగు
ఏలకులు - 3
ఎల్లిపాయలు - 8
అల్లం - చిన్న ముక్క
జీడిపప్పు - ఐదు పలుకులు
ఉల్లిగడ్డ - ఒకటి
పుదీనా,కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
లవంగాలు - 4
దాల్చిన చెక్క - చిన్న ముక్క
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి వార్చి ఉంచుకోవాలి. కొబ్బరి తురుము మిక్సీలో వేసి దాని నుండి పాలు తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. తర్వాత కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చి బటాణి వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీన తరుగు వేయాలి. బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగఫై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. ఇది ఉల్లిపాయ, పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం