telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

బేబీకార్న్, శెనెగల రైస్

10/24/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఉడికించిన అన్నం - రెండు కప్పులు,
ఉడికించిన శెనగలు - పావు కప్పు,
బేబీకార్న్ - ఆరు (నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా కోయాలి),
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - రెండు టేబుల్ స్పూన్లు.

మసాలా కోసం:
శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్,
ఎండుమిర్చి - ఐదు,
ధనియాలు - అర టేబుల్ స్పూన్,
మిరియాలు - అర టీస్పూన్,
జీలకర్ర - అర టీస్పూన్,
నువ్వులు - ఒక టీస్పూన్.

తయారుచేసే పద్ధతి :
  • శెనగల్ని ఒక రాత్రంతా లేదా వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  • బేబీకార్న్ను శుభ్రంగా కడిగి నిలువుగా చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
  • అన్నం పలుకుగా ఉడికించి వెడల్పాటి పళ్లానికి నూనె పూసి అందులో పరవాలి. పాన్ను వేడిచేసి మసాలా దినుసుల్ని వేగించి చల్లారాక పొడి కొట్టాలి.
  • నాన్ స్టిక్ కళాయిలో నూనె వేడిచేసి ఉడికించిన శెనగలు, బేబీకార్న్ వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి. తరువాత ఇందులో మసాలా పొడి వేసి కలపాలి.
  • ఉడికించిన అన్నాన్ని వేసి గరిటెతో కలిపి అవసరమనుకుంటే ఉప్పు వేయాలి. అన్నం మీద కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి. కొత్తిమీర తరుగు వేసి, ఆ పైన క్యారెట్ తురుము కూడా చల్లుకుంటే బాగుంటుంది. ఈ అన్నాన్ని కీరదోసకాయ రైతాతో తింటే వారెవ్వా అనాల్సిందే.

0 Comments

వెజ్ దమ్ బిర్యానీ

10/22/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం - 4 కప్పులు
కూరగాయలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/2 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
గరం మాసాలా పొడి - 1 టీ.స్పూ.
పెరుగు - 1 కప్పు
నిమ్మరసం - 3 టీ.స్పూ.
పుదీనా, కొత్తిమీర - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
నెయ్యి - 2 టీ.స్పూ.
లవంగాలు - 6
యాలకులు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
షాజీర - 1 టీ.స్పూ.

తయారుచేసే పద్ధతి:
  • బాస్మతి బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి. ఒక గినె్నలో ఎనిమిది గ్లాసుల నీళ్లలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బియ్యానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం తీసి వేయాలి. మంట తగ్గించి బియ్యం ముప్పావు వంతు ఉడకగానే జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి. బిర్యానీ చేయడానికి మందంగా ఉండే గినె్న లేదా పాన్ తీసుకోవాలి.
  • కుక్కర్ పాన్ ఐతే ఇంకా మంచిది. ఈ గినె్నలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేపి పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద (ఇష్టమైతే) కారం పొడి వేసి మరికొద్దిసేపు వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత అన్నం వేసి దానిపైన నెయ్యి, కొద్దిగా పాలువేసి మూతపెట్టాలి. దానిపైన బరువు ఏదైనా పెట్టి చిన్న మంటమీద మరో పది నిమిషాలు ఆవిరికి మగ్గనివ్వాలి. తర్వాత వేడిగా సర్వ్ చేయాలి.

0 Comments

మీల్‌మేకర్ బిర్యానీ

10/8/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మీల్ మేకర్ - 1 కప్పు,

బాస్మతి బియ్యం - 4 కప్పులు,
క్యారెట్ ముక్కలు - 1/4 కప్పు,
పచ్చి బఠానీలు - 1/4 కప్పు,
ఉల్లిపాయ - 1,
పచ్చిమిర్చి -3,
టమాటా -1,
పసుపు -1/4 టీ స్పూన్,
కారంపొడి -1 టీ స్పూన్,
గరం మసాలా పొడి - 1/4 టీ స్పూన్,
లవంగాలు -4,
యాలకులు -4,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
షాజీరా - 1 టీ స్పూన్,
అల్లంవెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్,
నూనె - 2 టీ స్పూన్స్,
నెయ్యి లేదా డాల్డా - 2 టీ స్పూన్స్

తయారు చేసేవిధానం :
  • నాలుగు కప్పుల నీళ్లను మరిగించి అందులో మీల్‌మేకర్ వేసి ఉంచాలి. చల్లారాక నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
  • పూర్తిగా ఆరిపోయాక మీల్‌మేకర్‌ను వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పది నిమిషాలు నాననివ్వాలి.
  • ఒక మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె, నెయ్యి లేదా డాల్డా కలిపి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి.
  • ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, క్యారెట్ ముక్కలు, బఠానీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన, షాజీర వేసి మరో రెండు నిమిషాలు వేపాలి.
  • ఇప్పుడు పసుపు, కారం పొడి, గరం మాసాలా పొడి వేసి కలిపి ఆరు కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
  • ఆ వెసట్లో నీటిని వడకట్టి బియ్యం వేయాలి. మంట కొంచెం తగ్గించి ముప్పావు ఉడికిన అన్నంలో వేయించిన మీల్ మేకర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటమీద మగ్గనివ్వాలి.
  • కొత్తిమీరతో అలంకరించి పెరుగు పచ్చడి లేదా కుర్మాతో ఈ మీల్‌మేకర్ బిర్యానీని సర్వ్‌చేయండి.

0 Comments

కార్న్‌ కోకోనట్‌రైస్‌

10/3/2013

0 Comments

 
Picture
కావలసినవి
అన్నం-రెండు కప్పులు
నూనె-రెండు చెంచాలు, నెయ్యి-చెంచా
పచ్చిమిర్చి ముద్ద-చెంచా
మిరియాలపొడి-అరచెంచా
ఉడికించిన స్వీట్‌కార్న్‌ గింజలు-నాలుగు చెంచాలు
కొబ్బరి తురుము-మూడు చెంచాలు
నిమ్మరసం-అరచెంచా
కొత్తిమీర-కొద్దిగా
ఉప్పు-రుచికి తగినంత
వెల్లుల్లి రెబ్బలు-నాలుగు
క్యారెట్‌ ముక్కలు-పావుకప్పు


తయారుచేసే విధానం
                  బాణలిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముద్దను వేయించి క్యారెట్‌ ముక్కలు చేర్చాలి. ఇందులో ఉడికించిన స్వీట్‌కార్న్‌ గింజలు, కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి అన్నం కలపాలి. ఆ తరువాత మిరియాలపొడి, తగినంత ఉప్పు కలిపి మరోసారి వేయించాలి. ఐదునిమిషాలయ్యాక దింపేసి నిమ్మరసం, కొత్తిమీర తురుము చేర్చి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.


పోషకాలు: శక్తి -390 కెలరీలు, మాంసకృత్తులు-5.5గ్రా. కార్బొహైడ్రేట్లు-50గ్రా. కొవ్వు -12.5గ్రా.

0 Comments

పుదీనా పన్నీర్ పలావ్

10/1/2013

0 Comments

 
Picture
కావలసినవి
బాస్మతి రైస్‌-2 కప్పులు
పన్నీర్‌-200గ్రా (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
తాజా పుదీనా-ఒక కట్ట
ఉల్లిపాయలు-2 (సన్నగా కట్‌ చేసుకోవాలి)
పచ్చిమిర్చి-4, అల్లం-చిన్నముక్క
వెల్లుల్లిపాయలు-4, చెక్క-చిన్నముక్క
ఉప్పు-రుచికి సరిపడా, నూనె-రెండు చెంచాలు
నీళ్లు-4 కప్పులు
తయారుచేసే విధానం
  • ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్‌ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
  • ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి. తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్‌, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్‌ చేయాలి. అంతే పుదీనా పన్నీర్‌ పలావ్‌ రెడీ.


0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    వెజ్ దమ్ బిర్యానీ
    ములగ ఆకులు
    మెంతి పులావు
    టమాటా పలావ్‌
    పల్లీ ఫ్రైడ్ రైస్
    వంకాయ వెల్లుల్లి మసాలా రైస్
    గుడ్లు
    పొంగల్
    కిచిడీ
    ఫ్రైడ్ రైస్
    బీరకాయ రైస్
    పుదీనా పలావు
    బీరకాయ రైస్
    శెనెగల రైస్
    టొమాటో పులావ్
    పుదీనా పన్నీర్ పలావ్
    దొండకాయ
    కొబ్బరి
    పులిహోర
    పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్
    కార్న్‌ కోకోనట్‌రైస్‌
    నిమ్మకాయ
    ప్రొటీన్ పులావ్
    గార్లిక్ ఫ్రైడ్ రైస్
    ఉసిరికాయ పులిహోర
    కాశ్మీరీ బిర్యానీ
    మష్రుమ్స్
    బీట్‌రూట్
    బేబీకార్న్
    కాలీఫ్లవర్ పులావ్
    బేబీకార్న్ పులావ్
    మొక్కజొన్న పులావ్
    చింతచిగురు పులిహోర
    మీల్‌మేకర్ బిర్యానీ

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.