అన్నం-రెండు కప్పులు
నూనె-రెండు చెంచాలు, నెయ్యి-చెంచా
పచ్చిమిర్చి ముద్ద-చెంచా
మిరియాలపొడి-అరచెంచా
ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు-నాలుగు చెంచాలు
కొబ్బరి తురుము-మూడు చెంచాలు
నిమ్మరసం-అరచెంచా
కొత్తిమీర-కొద్దిగా
ఉప్పు-రుచికి తగినంత
వెల్లుల్లి రెబ్బలు-నాలుగు
క్యారెట్ ముక్కలు-పావుకప్పు
తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముద్దను వేయించి క్యారెట్ ముక్కలు చేర్చాలి. ఇందులో ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు, కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి అన్నం కలపాలి. ఆ తరువాత మిరియాలపొడి, తగినంత ఉప్పు కలిపి మరోసారి వేయించాలి. ఐదునిమిషాలయ్యాక దింపేసి నిమ్మరసం, కొత్తిమీర తురుము చేర్చి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.
పోషకాలు: శక్తి -390 కెలరీలు, మాంసకృత్తులు-5.5గ్రా. కార్బొహైడ్రేట్లు-50గ్రా. కొవ్వు -12.5గ్రా.