రెండు కప్పుల బాస్మతి బియ్యం (30 ని. ముందుగా నానబెట్టుకోవాలి)
7 కప్పుల నీరు, తగినంత ఉప్పు
ఒక చిటికెడు కుంకుమ పువ్వు
కూర తయారీకి కావలసిన దినుసులు
అర కప్పు తరిగిన క్యారట్
అర కప్పు తరిగిన క్యాలీఫ్లవర్
అర కప్పు పచ్చి బఠాణీలు, 2 లేక 3 స్పూన్ల నూనె
1 స్పూన్ షాజీరా, 2 దాల్చిన చెక్క
2 లేక 3 చిన్న యాలకులు, 2 పెద్ద యాలకులు
3 లేక 4 లవంగాలు, 2 జాపత్రి
2 స్పూన్ల సోంప్, చిన్న అల్లం ముక్క
1 స్పూన్ కారం,
1 స్పూన్ గరమ్ మసాలా,
పావు స్పూన్ ఇంగువ, పావు స్పూన్ తురిమిన జాజికాయ,
6 స్పూన్ల పెరుగు (వడకట్టినది)
ఒక కప్ నీరు, రుచికి తగినంత ఉప్పు, ఇతర దినుసులు, అర కప్ పుదీనా, కొత్తిమీర
2 చిటికెల కుంకుమ పువ్వును పాలలో కాని నీటిలో కాని కలిపి ఉంచాలి
20 నుంచి 25 జీడిపప్పు, బాదం పప్పు
తయారు చేసే విధానం:
- ఏడు కప్పుల నీటిని మరిగించి ముందుగా నానపెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించాలి. బియ్యం ముప్పావు ఉడికిన తర్వాత నీటిని మొత్తం వార్చేసి వెడల్పాటి చిల్లుల గిన్నెలోకి తిరగపోయాలి. అన్నం ఆరిపోకుండా మూత పెట్టాలి. బాణలి పెట్టి అన్ని మసాలా దినుసులు వేసి రెండు నిముషాలు వేయించాలి. అందులో తరిగి పెట్టుకున్న అన్ని కూరముక్కలు వేయాలి.
- చిన్న మంటపై కొద్దిసేపు వేగనిచ్చి పెరుగు కలపాలి. కప్పు నీటిని,ఉప్పును కూడా వేసి మూతపెట్టి సన్నమంటపై కూర ముక్కలు ఉడికేంతవరకు ఉంచి దింపేయాలి. ఒక గిన్నెకు నెయ్యి రాసి రెండు మూడు గరిటెల అన్నాన్ని పరవాలి.
- దానిపై కూరను పరచి దానిపై పుదీనా, కొత్తిమీరతో పాటు కుంకుమ పువ్వు నీటిని కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు పొరలుగా అన్నం కూరలను పరచి గిన్నెను అల్యూమినియం ఫాయిల్తో మూసి గట్టిగా మూత పెట్టాలి. పొయ్యిపై ఒక మందపాటి వెడల్పు గిన్నెలో 3 గ్లాసుల నీరు పోసి, అందులో ఈ గిన్నెను ఉంచి చాలా సన్నని మంటపై 30 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆఖరున డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి.