ఉసిరికాయ ముక్కలు - ఒక కప్పు,
కొబ్బరి తురుము - అర కప్పు,
పచ్చిమిరపకాయలు - 5,
బియ్యం - రెండు కప్పులు,
జీడిపప్పు - 10,
పల్లీలు - 2 టీ స్పూన్స్,
మినపప్పు - అర టీ స్పూన్,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్,
ఎండు మిరపకాయలు - 3,
పసుపు - కొద్దిగా,
కరివేపాకు - 2 రెమ్మలు ,
కొత్తిమీర - అర కట్ట,
నిమ్మరసం - 2 టీ స్పూన్స్,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
- ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి.
- ఇలా చేసేప్పుడు నీళ్ళు మాత్రం పోయకూడదు. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- అన్నాన్ని వండి పక్కన పెట్టాలి.
- తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి జీడిపప్పు, పల్లీలు, మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఇవి వేగాక కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఉసిరికాయ పొడి వేసి కలపాలి. కాసేపటి తర్వాత ఉప్పు వేయాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉండనివ్వాలి.
- ఇప్పుడు ముందే వండేసిన అన్నాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పోసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.