బియ్యం - కప్పు
పెసర పప్పు - పావు కప్పు
మిరియాలు - టీస్పూన్
జీలకర్ర - టీస్పూన్
నెయ్యి - పావు కప్పు
జీడిపప్పు - 12
కరివేపాకు - 2 రెమ్మలు
మంచి నీళ్ళు - 6 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బియ్యం, పెసరపప్పు కలిపి కడగాలి.
- ఫ్రెషర్ కుక్కర్ లో నెయ్యీ వేసి కాగాక కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత కడిగిన బియ్యం పెసరపప్పు కూడా వేసి ఓ రెండు నిముషాలు వేయించాలి. తరువాత నీళ్ళు పోసి, ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించి దించాలి.
- దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా సాంబారుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం