ఉడికించిన అన్నం - రెండు కప్పులు,
ఉడికించిన శెనగలు - పావు కప్పు,
బేబీకార్న్ - ఆరు (నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా కోయాలి),
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
మసాలా కోసం:
శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్,
ఎండుమిర్చి - ఐదు,
ధనియాలు - అర టేబుల్ స్పూన్,
మిరియాలు - అర టీస్పూన్,
జీలకర్ర - అర టీస్పూన్,
నువ్వులు - ఒక టీస్పూన్.
తయారుచేసే పద్ధతి :
- శెనగల్ని ఒక రాత్రంతా లేదా వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- బేబీకార్న్ను శుభ్రంగా కడిగి నిలువుగా చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
- అన్నం పలుకుగా ఉడికించి వెడల్పాటి పళ్లానికి నూనె పూసి అందులో పరవాలి. పాన్ను వేడిచేసి మసాలా దినుసుల్ని వేగించి చల్లారాక పొడి కొట్టాలి.
- నాన్ స్టిక్ కళాయిలో నూనె వేడిచేసి ఉడికించిన శెనగలు, బేబీకార్న్ వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి. తరువాత ఇందులో మసాలా పొడి వేసి కలపాలి.
- ఉడికించిన అన్నాన్ని వేసి గరిటెతో కలిపి అవసరమనుకుంటే ఉప్పు వేయాలి. అన్నం మీద కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి. కొత్తిమీర తరుగు వేసి, ఆ పైన క్యారెట్ తురుము కూడా చల్లుకుంటే బాగుంటుంది. ఈ అన్నాన్ని కీరదోసకాయ రైతాతో తింటే వారెవ్వా అనాల్సిందే.