బియ్యం - కప్పు
మిరియాల పొడి - 2 టీస్పూన్లు
మొక్కజొన్న గింజలు - అరకప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
అజినమెటో - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
సోయాసాస్ - అరటీస్పూన్
జీలకర్ర - టీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర వేయాలి. తరువాత మొక్కజొన్న గింజలు, మిరియాల పొడి, అజినమెటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు నిముషాలు వేయించాలి. తరువాత వండిన అన్నం వేసి బాగా కలపాలి. డిన్నర్ కి ఇది ఎంతో రుచిగా స్పైసిగా ఉంటుంది.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం