telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

1/5/2014

0 Comments

 
Picture
                 జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి..
 
 వారానికి మూడుసార్లు మాత్రమే!
                   షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి. రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి. వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు.
 
సహజసిద్ధంగానే పొడిగా!
               జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్  మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు.
 
 ట్రిమ్మింగ్!
               వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి.
 
 ఇంటి చికిత్స:

 నూనెతో మర్దన: జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
     
 గుడ్డుతో: మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
 
 బొప్పాయితో: ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది.
      
 తేనెతో: తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.

0 Comments

చుండ్రుకు ఇంటి వైద్యం

12/30/2013

0 Comments

 
Picture
  • పుదీనా ఆకుల్ని మెత్తగా రుబ్బి..కాసిన్ని నీళ్లు కలిపి.. మాడుకు పట్టించి.. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
  • గోరువెచ్చటి కొబ్బరినూనెను రాత్రిపూట జుట్టు కుదుళ్లకు మర్దన చేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
  • శీకాకాయ పౌడర్‌ను గోరువెచ్చటి నీటిలో కాసేపు నానబెట్టి తలస్నానం చేస్తే బెటర్.
  • ముదురు వేపాకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి.. తలకు పట్టించాలి.
  • ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. కాస్త గట్టిపడ్డాక షాంపూలా వాడితే బాగుంటుంది.
  • రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి కొంచెం నీళ్లు జోడించి.. వారానికి రెండుసార్లు వాడితే మొండి చుండ్రును వదిలించుకోవచ్చు.
  • గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.

0 Comments

నలుగు వెలుగులు

12/21/2013

0 Comments

 
Picture
          చలికాలం స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి.
 
 
నలుగు పిండి తయారుచేసే విధానం:
                  పసుపు, ఆవపిండి, ఉలవ  పిండి, మంచి గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి, శనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండి మరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో మర్ధనా చేయాలి. దీని వల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.

0 Comments

చలి చర్మానికి...

11/30/2013

0 Comments

 
Picture
  • చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే.
  • ఒక టేబుల్‌స్పూన్ ఉడికించిన ఓట్స్‌ని మెత్తగా చేసి రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతమవుతుంది. సున్నితమైన చర్మం గలవాళ్లు నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి గాఢతను తగ్గించి వాడాలి.
  • శెనగపిండి, పసుపు, పెరుగు ఈ మూడింటినీ కలిపి రాసుకుంటే చర్మంపై ఉండే టాన్ పోతుంది. పసుపు నల్లటి మచ్చల్ని, మచ్చల్ని పోగొడుతుంది.
  • ఎక్కువ టాన్ ఉంటే పెరుగు బాగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.


0 Comments

మెరిసిపోండిలా..

11/14/2013

0 Comments

 
Picture
తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్‌లు పూసి పూసి విసుగెత్తిపోయారా? అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...
* ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి.
* క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.
* గుడ్డు తెల్లసొన, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది చర్మానికి యవ్వనకాంతిస్తుంది.
* పొద్దుతిరుగుడుపువ్వు గింజల్ని పచ్చి పాలలో ఒక రాత్రంతా నానపెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి.
* ఆలు లేదా టొమాటో రసాలను ప్రతిరోజూ రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
* మీగడలో బ్రెడ్ ముక్కలు కలిపి రాసుకున్నా చర్మం మృదువుగా తయారవుతుంది.


0 Comments

తలస్నానానికి ముందు తర్వాత..

11/12/2013

0 Comments

 
Picture
                      స్ర్తీలు వారి శరీర భాగాల్లో అన్నింటికంటే జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే వారి శిరోజాలే వారికి అందం అని భావిస్తుంటారు. అటువంటి శిరోజాలకోసం తలస్నానానికి ముందు తర్వాత ఆరు చిట్కాలు పాటించండి.. మీ జుట్టును నిగనిగలాడేలా చేసుకోండి.

1. గోరువెచ్చని కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్ళకు పట్టించి మర్దన చేయాలి.
2. టర్కీటవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టండి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి.
3. శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తడిజుట్టుకు కండిషనర్‌ని రాయండి. అయితే మాడుకు కండిషనర్‌ని తగలనివ్వద్దు.
4. జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయర్‌ని ఉపయోగించవద్దు. తలకు టవల్‌ చుట్టి కాసేపు వదిలేయాలి. జుట్టు తడిని టవల్‌ పీల్చుకుని, పొడిగా అవుతుంది.
5. పార్టీలకో, బయటకు వెళ్ళినప్పుడో జుట్టు మెరవాలని హెయిర్‌ స్ప్రేలు వాడకూడదు. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
6. ప్రయాణాలలో కిటికీ దగ్గర కూర్చుంటే తలకు స్కార్ఫ్‌ కట్టుకోవాలి. గాలికి జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దుమ్ముకూడా అంటదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.

0 Comments

చర్మం  మృదువుగా  ఉండాలంటే   ........

11/7/2013

0 Comments

 
Picture
మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్ర నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది.

అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి

0 Comments

పాదాలకు క్యారెట్ తురుముతో ప్యాక్ వేసుకుంటే........

10/30/2013

0 Comments

 
Picture
క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి. కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు
తొలగిపోతాయి.


0 Comments

మొటిమలు లేకుండా...

10/26/2013

0 Comments

 
Picture
మీ ముఖంమీద మొటిమలు లేకుండా ఆకర్షణీయంగా ఉండాలంటే, కంటికింద చారలు రాకుండా ఉండాలంటే  మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచనలతో, ఆశావహమైన భావనలతో ఉంటే రక్తప్రసరణ బాగుండి, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ మొటిమల నుండి ఉపశమనానికి కొన్ని చిట్కాలు.
- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది.
- గిన్నెలో నీళ్లు మసలపెట్టి ఆవిరిని ముఖానికి పట్టడం హితకరం. ఈ ఆవిరి 8-10 నిమిషాలు పడితే చాలు.
- వేపపూలు చూర్ణించిన ముద్దలో కొంచెం పసుపు, వెన్నపూస కలిపి పొక్కులపై రాసి గంట తరువాత కడిగి వేయండి. మంచి ఫలితం ఉంటుంది.
- కాకరకాయని మధ్యలో చీల్చి, చీల్చిన తెల్లనిభాగంతో చర్మంపై సున్నితంగా రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
- పోకచెక్క నీళ్లతో గంధం తీసి ముఖానికి పట్టించి మూడు గంటల తర్వాత కడిగేసుకోవాలి.
- ఉసిరిక వలుపు, తమలపాకుపై రాసుకునే కాచు కలిపి దానిలో బాదంపాటు కలిపి చూర్ణం చేసి పావు చెంచా చొప్పున తీసుకుంటే తెల్లని మచ్చలు పోతాయి.
- పాలమీగడలో పసుపు, పొట్లకాయ, పైపొట్టు, నువ్వులు కలిపి ముఖానికి రాసుకుంటే అన్ని మొటిమలు పోయి ముఖం అందంగా తయారవుతుంది.




0 Comments

కొవ్వును కరిగించే నువ్వులు

10/24/2013

1 Comment

 
Picture
  • నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉండడం వల్ల చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొలలు (పైల్స్‌) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషయాలలో ఇది బాగా పని చేస్తుంది.
  • నువ్వు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు లభిస్తాయి. నల్ల నువ్వులలో మాత్రం ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
  • నువ్వుల నూనె కొవ్వును కరిగిస్తుంది. బాలింతల్లో చనుబాలు పెరగడానికి నువ్వు లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నం బాగా జీర్ణం కావడానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కేశ వృద్ధికి నువ్వుల నూనె పని చేస్తుంది. నువ్వు పువ్వులను నెయ్యి, తేనెలను కలిపి తల మీద లేపనంగా పెడితే బట్ట తలపై కూడా జుట్టు బాగా వస్తుంది. రక్త విరేచనాలకు నువ్వులను మేకపాలతో కలిపి సేవిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • బాగా మరుగుతున్న నీటిలో నువ్వుల ఆకులను వేసి, దాని ద్వారా వచ్చే ఆవిరిని పీలిస్తే అతిసారం తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులకూ, శరీరంపై గాయాలకూ నువ్వులను పూతగా పెడితే మంచి ఫలితం వస్తుంది. దంతాలకు కూడా నువ్వులు బాగా మేలు చేస్తాయి ఎందువల్ల అంటే నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
  • నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవు తాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్‌ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.

1 Comment
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    మీ జుట్టు సంరక్షణ కోసం
    మెడ కోసం
    కేశ సంరక్షణ
    చలి చర్మానికి...
    ముఖం
    కళ్ళ కోసం
    చర్మం
    పాదాల కోసం
    చేతుల కోసం
    నలుగు వెలుగులు
    పెదవుల కోసం
    ముడతలు తగ్గడం కోసం
    జుట్టు నల్లగా ఉండాలంటే..
    చుండ్రు నివారణ కోసం
    పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?
    కొవ్వును కరిగించే నువ్వులు
    అందానికి బీట్‌రూట్‌
    చుండ్రుకు ఇంటి వైద్యం
    కరివేపాకుతో కేశ సౌందర్యం
    వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.