telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

జుట్టు నల్లగా ఉండాలంటే...

10/22/2013

0 Comments

 
Picture
                     ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్‌ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.

           త్రిఫల చూర్ణాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా వేడి చేసి చల్లారిన తరువాత తాగండి.

                  అలాగే కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్‌ చేయండి.

ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొరవిప్పిన నల్లతారులా నిగనిగలాడుతుంది. ప్రయత్నించి చూడండి.

0 Comments

అందానికి బీట్‌రూట్‌

10/16/2013

0 Comments

 
  • గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి... చర్మం కాంతులీనుతుంది.
  • బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.
  • బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
  • బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.
  • జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.
0 Comments

కరివేపాకుతో కేశ సౌందర్యం

10/11/2013

0 Comments

 
Picture
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు. అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్‌ పెట్టవచ్చును.

అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది.చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.
ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా

తయార వుతాయి.
కరివేపాకుతో పేస్టు
మెహందీ - అర కప్పు
కరివేపాకు - అరకప్పు
మందారం ఆకులు - అర కప్పు
కుంకుడు కాయలు - అర కప్పు
ఎలా తయారు చేయాలంటే...
పైన చెప్పిన వస్తువుల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మెరిసిపోతుంది.


0 Comments

పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?

10/7/2013

0 Comments

 
Picture
నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు...

  • పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.
  • పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది.
  • పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయనమవుతాయి.
  • పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి.
  • పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి.


0 Comments

ముఖంపై మచ్చలు పోవాలంటే .........

9/25/2013

0 Comments

 
                       అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

0 Comments

మీ జుట్టు సంరక్షణ కోసం

9/20/2013

0 Comments

 
  • తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు వెనిగర్‌ను ఒక మగ్గు నీళ్ళలో వేసి తల మీద నుంచి పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.
  • కొంచెం ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు మర్దనా చేసి ఒక గంటాగి తల స్నానం చేస్తే చుండ్రు మటుమాయమవుతుంది.
0 Comments

ఉఫ్ డాండ్రఫ్

9/15/2013

0 Comments

 
  • నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.
  • * ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీళ్లతో మాడుపై మర్దనా చేసి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండు పోతుంది (మర్దనా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నుదుటి మీదకి నీళ్లు కారకుండా చూసుకోవాలి.)
  • * మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.
  • * టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.
  • * బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.
  • * పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. సమతులాహారాన్ని తినాలి. బి విటమిన్, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
0 Comments

మెరిసే పెదవులకోసం...

9/14/2013

0 Comments

 
  • -పొడి బారిన పెదవులపై కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి.
  • - కొంచెం పెరుగు తీసుకుని అందులో ఓ రెండు కుంకుమపువ్వు రెబ్బలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు రాసుకుంటే పెదవులకి మంచి రంగు వస్తుంది.
  • -నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
  • - టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.
  • -వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
  • - గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.
  • - ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.
  • -బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.
0 Comments

పాదాల పగుళ్లుకు...

9/13/2013

0 Comments

 
  • గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.
  • పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.
  • వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.
  • బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు.
  • అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.
  • రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

0 Comments

శరీరం మృదువుగా ఉండాలంటే

9/11/2013

0 Comments

 
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుందాం.   
  • - మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.  
  • - కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.
  • - సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    మీ జుట్టు సంరక్షణ కోసం
    మెడ కోసం
    కేశ సంరక్షణ
    చలి చర్మానికి...
    ముఖం
    కళ్ళ కోసం
    చర్మం
    పాదాల కోసం
    చేతుల కోసం
    నలుగు వెలుగులు
    పెదవుల కోసం
    ముడతలు తగ్గడం కోసం
    జుట్టు నల్లగా ఉండాలంటే..
    చుండ్రు నివారణ కోసం
    పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?
    కొవ్వును కరిగించే నువ్వులు
    అందానికి బీట్‌రూట్‌
    చుండ్రుకు ఇంటి వైద్యం
    కరివేపాకుతో కేశ సౌందర్యం
    వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.