పచ్చి బఠాణీలు : ఒక కప్పు
బీన్స్, క్యారెట్ ముక్కలు : చెరో కప్పు
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు : ఒక కప్పు
మైదా, వెన్న : అర టీస్పూన్ చొప్పున
మిరియాల పొడి : ఒక టీస్పూన్
ఉప్పు : అర టీస్పూన్
తయారీ విధానం...
- ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి.
- పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి.
- ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి.
- పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..!
- ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.