అరటి పండు ముక్కలు - 1 కప్పు
పాలు - 1 కప్పు
రోజ్ సిరప్ లేదా రూహ్అఫ్జా - 3-4 టీ.స్పూ.
పంచదార - 3 టీ.స్పూ.
ఐస్ ముక్కలు- కొన్ని
జీడిపప్పు, బాదం పప్పు - 6
తయారుచేసే పద్ధతి :
- మగ్గిన అరటిపండు ముక్కలు, పంచదార వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఇందులో పాలు, ఐస్ ముక్కలు, రోజ్ సిరప్ వేసి నురగ వచ్చేలా బ్లెండ్ చేసి పొడవాటి గ్లాసుల్లో పోసి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పుతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి. దీని కోసం చల్లటి పాలనే ఉపయోగించాలి. ఈ మిల్క్ షేక్ సర్వ్ చేసే ముందే కలుపుకోవాలి. ముందే చేసి పెట్టుకుంటే అరటి పండు మూలంగా రంగు మారొచ్చు.