పాలు - 100 గ్రా.
చక్కెర - 10 గ్రా.
గిలక్కొట్టిన క్రీం- 100 గ్రా.
తేనె - 10 గ్రా.
జెలాటిన్ - 10 గ్రా.
గ్రీన్ టీ ఆకులు - ఒకటిన్నర చెంచ
నిమ్మరసం - చెంచ
నిమ్మపొట్టు పొడి - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
- ఓ గిన్నెలో పాలను తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర, తేనె, గ్రీన్ టీ ఆకులు వేసి మరికొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలి. పాలు మళ్ళీ ఒక పొంగు వచ్చాక వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకొని పది నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచి బయటకి తీయాలి.
- అందులో గిలక్కొట్టిన క్రీం, నిమ్మరసం, నిమ్మపొట్టు పొడి, చివరగా జెలాటిన్ ని కూడా వేసి బాగా కలిపి మళ్ళీ ఫ్రిజ్ లో ఉంచేయాలి. చల్లగా ఉండే ఈ గ్రీన్ టీ పానీయం చాలా రుచిగా ఉంటుంది.
మూలం : ఈనాడు వసుంధర