చిలగడ దుంపలు - ఒక కప్పు (ఉడికించి పొట్టు తీసినవి)
బంగాళాదుంపలు - ఒక కప్పు (ఉడికించి పొట్టు తీసినవి)
కీరా దోసకాయ - ఒకటి
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - ఒకటి
పల్లీలు - టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చిక్కని పెరుగు - కప్పు
తయారుచేసే పద్ధతి :
- కీరా దోసకాయ తొక్కు తీసి సన్నని ముక్కలుగా తరగాలి.
- ఓ బాణలిలో వేసి వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి.
- వెడల్పాటి బౌల్ లో పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత జీలకర్ర పొడి, ఉప్పు, సన్నగా తర్గిన మిర్చి ముక్కలు వేసి కలపాలి.
- ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేసి కలపాలి. తరువాత వేరుసెనగపప్పు, కొత్తిమీర తురుము కూడా వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టి తీసి చల్లచల్లగా అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం