బీట్ రూట్ - ఒకటి
పంచదార - టీస్పూన్
పెరుగు - కప్పు
బ్లాక్ సాల్ట్ - చిటికెడు
జీలకర్ర పొడి - పావుటీస్పూన్
యాలకుల పొడి - చిటికెడు
జీడిపప్పు - రెండు
తేనె - రుచికి సరిపడా
పైనాపిల్ ముక్కలు - కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- బీట్ రూట్ తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- పెరుగు, పంచదార, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి గిలక్కొట్టాలి. తరువాత మెత్తగా చేసిన బీట్ రూట్ ముద్దని కూడా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. బయటకు తీసి గ్లాసుల్లో పోసి అందించే ముందు జీడిపప్పు ముక్కలు, తేనె, పైనాపిల్ ముక్కలు కలపాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం