క్యారట్లు : మూడు
తాజా క్రీమ్ : టేబుల్ స్పూన్
పంచదార : టేబుల్ స్పూన్
నిమ్మరసం : టీస్పూన్
పూదీనా ఆకులు : మూడు లేదా నాలుగు
మిరియాల పొడి : పావు టీస్పూన్
ఉప్పు : కొద్దిగా
నీరు : సుమారు 500 మి.లీ
తయారుచేసే పద్దతి :
మొదట క్యారట్లను శుబ్రముగా కడిగి, పైన తొక్క తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కప్పెడు నీరు, క్యారట్ ముక్కలు వేసి, ఆ పాత్రను స్టవ్ మీద ఉంచి సుమారు 5 నిమిషాలు ఉడికించి, పెద్ద పళ్ళెంలో పోయాలి. చల్లారాక మిక్సి లో వేసి మెత్తగా చేసాక, నిమ్మరసం, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి బాగా మెత్తగా అయ్యి, అన్ని కలిసే వరకు మరో మారు మిక్సి పట్టుకోవాలి. శుబ్రము అయిన వస్రంలో వేసి వడ పోయాలి, పూదీన ఆకులను సన్నగా తురిమి కాని, మెత్తగా పేస్ట్ చేసి కాని పక్కన పెట్టుకోవాలి. తయారుచేసి ఉంచుకున్న క్యారట్ జ్యూస్ లో పూదీన పేస్ట్ వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక గాజు గ్లాసులో పోసి, పైన కొద్దిగా క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి