యాపిల్ - ఒకటి
పాలు - 100 గ్రా.
చక్కెర - 10 గ్రా.
గిలక్కొట్టిన క్రీం- 100 గ్రా.
చాక్లెట్ - 100 గ్రా.
జెలాటిన్ - 10 గ్రా.
వెన్న - 20 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- యాపిల్ చెక్కు తీసి ముక్కల్లా తరిగి వెన్నలో వేయించాలి.
- తరువాత అందులో సగం చక్కెర వేసి మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి, యాపిల్ ముక్కలు మెత్తగా అయ్యాక పొయ్యి మీద నుంచి దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలూ, మిగిలిన చక్కెర, చాక్లెట్ తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. పాలు మరిగి, చాక్లెట్ కరిగాక గిలక్కొట్టిన క్రీం, ముందుగా సిద్దం చేసుకున్న యాపిల్ మిశ్రమం, గోరు వెచ్చని నీటిలో కలిపిన జెలాటిన్ ని వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక తీసుకోవాలి.
మూలం : ఈనాడు వసుంధర