కీరదోస - నాలుగు
పాలు - ఒకటిన్నర లీటర్
చక్కెర - 200 గ్రా.
యాలకుల పొడి - అరచెంచ
జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా - అన్నీ కలిపి 75 గ్రా.
నెయ్యి - రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి :
- కీరదోస చెక్కుతోపాటు గింజల్నీ తీసేసి మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
- ఓ గిన్నెలో పాలు తీసుకొని, చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి అది చిక్కబడుతుంది.
- ఓ బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష తప్ప మిగిలిన అన్నీ పలుకుల్ని మెత్తగా కాకుండా పోడిలా చేసుకోవాలి.
- ఇప్పుడు ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి పాలల్లో వేసి వేసి మళ్ళీ కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
మూలం : ఈనాడు వసుంధర