పచ్చిమామిడి కాయలు - రెండు
పంచదార - పావుకప్పు
జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - రుచికి సరిపడా
ఇంగువ - పావుటీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- ముందుగా మామిడికాయలను శుభ్రముగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఉడికించాలి. challarina తర్వాత బయటకు తీసి తొక్కు తీసి గుజ్జును మాత్రం ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నేలోనే జీలకర్ర పొడి,మిరియాల పొడి,బ్లాక్ సాల్ట్,ఇంగువ,పంచదార వేసి బాగా కలపాలి. పంచదార కరిగిన తర్వాత షర్బత్ ను నాలుగు గ్లాసుల్లో సమంగా పోసి గ్లాసు నిండుగా చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం