కావలసిన పదార్థాలు :
అల్లం - 8 అంగుళాల ముక్క
పంచదార - కప్పు
నిమ్మరసం - కప్పు
కమలా పండ్ల రసం - ఒకటిన్నర కప్పులు
చల్లని నీళ్ళు - 3 కప్పులు
తయారుచేసే పద్ధతి :
అల్లంపై పొట్టు తీసి సన్నగా తురమాలి. మందపాటి పాన్ లో అల్లం తురుము, పంచదార, కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత మంట తగ్గించి మూత తీసి మరో పదిహేను నిముషాలు మరగనివ్వాలి. ఇప్పుడు దీన్ని వడగట్టి చల్లారనివ్వాలి. తరువాత దీనికి నిమ్మరసం, కమలా రసం, కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తాగే ముందు బయటకి తీసి చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం