కొబ్బరి బొండాం : ఒకటి
కర్బూజ ముక్కలు : రెండు కప్పులు
పాలు : మూడు కప్పులు
చక్కెర : పావు కప్పు
క్రీం : నాలుగు చెంచాలు
రోజ్ వాటర్ : అర కప్పు
తేనె : చెంచెడు
తయారుచేసే పద్దతి :
ముందుగా కొబ్బరి బొండాంలోని నీళ్ళను ఒక పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత బొండాంలోని లేత కొబ్బరి తీయాలి. కొబ్బరి, కర్బూజ ముక్కలు విడివిడిగా జ్యూసర్లో వేయాలి. ఆ తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు, కొబ్బరి నీళ్ళు, రోజ్ వాటర్, చక్కెర, తేనె వేసి మరి కొంచెం సేపు జ్యూస్ చేసి నురగ వచ్చిన తర్వాత ఒక గాజు పాత్రలో పోయాలి. పైన క్రీం వేసి ఫ్రిజ్ లో పెట్టి కూల్ అయిన తర్వాత సర్వ్ చేయాలి.
మూలం: నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం