మ్యాంగో ఐస్ క్రీం - ఒకటిన్నర స్పూనులు
మామిడి పండు - ఒకటిన్నర పండు
పాలు - 40 మి.లీ
పంచదార - ఒక టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సర్ లో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి.
- సగం మామిడి పండు ముక్కను గుజ్జులా చేసి పక్కన ఉంచుకోవాలి.
- పాలు కాచి చల్లార్చాలి.
- గ్లాసులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు రసం, పాలు, మ్యాంగో ఐస్ క్రీంలను వరుసగా వేసి బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక