బాసుమతి బియ్యం : రెండు కప్పులు (ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
నూనె : తగినంత
నెయ్యి : కొద్దిగా
అల్లం వెల్లుల్లి ముద్ద : టేబుల్ స్పూను
గరం మసాలా : కొద్దిగా
కొబ్బరి పొడి : స్పూను
ధనియాల పొడి : టేబుల్ స్పూను
జీలకర్ర పొడి : పావు టేబుల్ స్పూను
కారం పొడి : టేబుల్ స్పూను
పసుపు : చిటికెడు
దొండకాయలు : పావు కేజీ (పొడవుగా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి )
ఉప్పు : రుచికి సరిపడ
నిమ్మరసం : టేబుల్ స్పూను
కొత్తిమీర : కొద్దిగా
పూదీన : కొద్దిగా
పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు
తయారీ విధానం :
మందపాటి గిన్నె లేదా బాండి తీసుకొని నూనె, నెయ్యి సమానముగా తీసుకొని కాగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి సన్నని సేగన బాగా మగ్గించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనె లో మసాల దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పూదీన జత చేయాలి. ఇవి వేగిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసి కొద్ది సేపు వేయించుకోవాలి. ఇవన్ని వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అన్ని బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పొయ్యి నుంచి దింపేయాలి. రెడీ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.
మూలము : నవ్య