బాస్మతి బియ్యం - 2 కప్పులు
బీట్‌రూట్ తురుము - 3/4 కప్పు
పుదీనా ఆకులు - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి - 5 రెబ్బలు
లవంగాలు - 5
యాలకులు - 3
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
షాజీర - 1/2 టీస్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి:
- బాస్మతి బియ్యం కడిగి పదిహేను నిమిషాలు నానిన తర్వాత పొడి పొడిగా ఉండేలా వండుకోవాలి.
- బీట్‌రూట్ తురిమిన తర్వాత గట్టిగా పిండేసి నీరంతా తీసేయాలి.
- వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో నలక్కొట్టి సన్నగా తరిగిన వెల్లుల్లి, పుదీనా ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బీట్‌రూట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేపాలి.
- తర్వాత అన్నం, తగినంత ఉప్పువేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.
మూలం : ఆంధ్రభూమి