బాస్మతి బియ్యం - 120 గ్రా.
ఎండు బఠాణీ - 20 గ్రా;
రాజ్మా - 20 గ్రా.
సోయాబీన్స్ - 20 గ్రా;
క్యారట్ తరుగు - 40గ్రా.,
ఉల్లితరుగు - కప్పు;
టొమాటోలు - 3
ఉప్పు - తగినంత;
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు
పేస్ట్ కోసం:
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 4;
వెల్లుల్లి రేకలు - 6
కొత్తిమీర - చిన్న కట్ట;
లవంగాలు - 2
ఏలకులు - 2;
దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీ స్పూను;
పసుపు - కొద్దిగా
తయారి:
- బఠాణీ, రాజ్మా, సోయా గింజలు, బియ్యం... వీటిని విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టి, నీరు ఒంపేయాలి.
- బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి.
- టొమాటో తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
- బియ్యం, నానబెట్టుకున్న గింజలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి.
- తగినంత నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో సుమారు పది నిముషాలు ఉడికించి దింపేయాలి.
- అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.