మీల్ మేకర్ - 1 కప్పు,
బాస్మతి బియ్యం - 4 కప్పులు,
క్యారెట్ ముక్కలు - 1/4 కప్పు,
పచ్చి బఠానీలు - 1/4 కప్పు,
ఉల్లిపాయ - 1,
పచ్చిమిర్చి -3,
టమాటా -1,
పసుపు -1/4 టీ స్పూన్,
కారంపొడి -1 టీ స్పూన్,
గరం మసాలా పొడి - 1/4 టీ స్పూన్,
లవంగాలు -4,
యాలకులు -4,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
షాజీరా - 1 టీ స్పూన్,
అల్లంవెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్,
నూనె - 2 టీ స్పూన్స్,
నెయ్యి లేదా డాల్డా - 2 టీ స్పూన్స్
తయారు చేసేవిధానం :
- నాలుగు కప్పుల నీళ్లను మరిగించి అందులో మీల్‌మేకర్ వేసి ఉంచాలి. చల్లారాక నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
- పూర్తిగా ఆరిపోయాక మీల్‌మేకర్‌ను వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పది నిమిషాలు నాననివ్వాలి.
- ఒక మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె, నెయ్యి లేదా డాల్డా కలిపి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి.
- ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, క్యారెట్ ముక్కలు, బఠానీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన, షాజీర వేసి మరో రెండు నిమిషాలు వేపాలి.
- ఇప్పుడు పసుపు, కారం పొడి, గరం మాసాలా పొడి వేసి కలిపి ఆరు కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- ఆ వెసట్లో నీటిని వడకట్టి బియ్యం వేయాలి. మంట కొంచెం తగ్గించి ముప్పావు ఉడికిన అన్నంలో వేయించిన మీల్ మేకర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటమీద మగ్గనివ్వాలి.
- కొత్తిమీరతో అలంకరించి పెరుగు పచ్చడి లేదా కుర్మాతో ఈ మీల్‌మేకర్ బిర్యానీని సర్వ్‌చేయండి.