బాస్మతి బియ్యం - 4 కప్పులు
కూరగాయలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/2 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
గరం మాసాలా పొడి - 1 టీ.స్పూ.
పెరుగు - 1 కప్పు
నిమ్మరసం - 3 టీ.స్పూ.
పుదీనా, కొత్తిమీర - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
నెయ్యి - 2 టీ.స్పూ.
లవంగాలు - 6
యాలకులు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
షాజీర - 1 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి:
- బాస్మతి బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి. ఒక గినె్నలో ఎనిమిది గ్లాసుల నీళ్లలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బియ్యానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం తీసి వేయాలి. మంట తగ్గించి బియ్యం ముప్పావు వంతు ఉడకగానే జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి. బిర్యానీ చేయడానికి మందంగా ఉండే గినె్న లేదా పాన్ తీసుకోవాలి.
- కుక్కర్ పాన్ ఐతే ఇంకా మంచిది. ఈ గినె్నలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేపి పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద (ఇష్టమైతే) కారం పొడి వేసి మరికొద్దిసేపు వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత అన్నం వేసి దానిపైన నెయ్యి, కొద్దిగా పాలువేసి మూతపెట్టాలి. దానిపైన బరువు ఏదైనా పెట్టి చిన్న మంటమీద మరో పది నిమిషాలు ఆవిరికి మగ్గనివ్వాలి. తర్వాత వేడిగా సర్వ్ చేయాలి.