బాస్మతీ రైస్ - ఒక కప్పు,
కాలీఫ్లవర్ - అర కప్పు,
క్యారెట్స్ - 2,
బఠాణీలు - 2 స్పూన్స్,
ఉల్లిగడ్డ - 1,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
దాల్చినచెక్క - 1,
యాలకులు - 2,
బిర్యానీ ఆకు - 2,
జీడిపప్పు - 12,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి.
- ఈలోపు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి.
- ఆ కడాయిలోనే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకును వేయించాలి. అందులో కాలీఫ్లవర్ ముక్కలు, బఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి గట్టిగా మూత పెట్టాలి.
- పావుగంట తర్వాత అన్నం కలిపి సన్న మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉంచి దించేయాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులను అందంగా గార్నిష్ చేసి వడ్డిస్తే లొట్టలేసుకొంటూ తింటారు