అన్నం - 2 కప్పులు
వంకాయలు - 4
ఎండుమిర్చి - 4
ధనియాలు - 1 టీ.స్పూ.
జీలకర్ర - 1/4 టీ.స్పూ.
వెల్లుల్లి - 5
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెబ్బలు
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
నూనె - 3 టీ.స్పూ.
ఇలా చేయాలి
- అన్నం పొడి పొడిగా ఉండేలా వండి పెట్టుకోవాలి.
- వంకాయలను నిలువుగా ముక్కలు చేసుకుని ఉప్పు నీళ్లలో వేసి పెట్టాలి.
- ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కాస్త వేయించి బరకగా పొడి చేసుకోవాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక వంకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి నిదానంగా కరకరలాడేలా వేయించాలి.
- వంకాయ ముక్కలు వేగిన తర్వాత మసాలా పొడి వేసి ముక్కలపై తగినంత ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత అన్నం వేసి దానికి తగినంత ఉప్పుకూడా వేసి మొత్తం కలియబెట్టాలి. రెండు నిమిషాలు వే యించి వేడిగా సర్వ్ చేయాలి.