అన్నం - ఒక కప్పు,
బీరకాయలు - రెండు,
ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి,
ఎండుమిర్చి - నాలుగు,
కరివేపాకులు - కొన్ని,
ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు - ఒక్కో టీస్పూన్,
మినపప్పు- అర టీస్పూన్,
నూనె - రెండు టీస్పూన్లు,
ఉప్పు - సరిపడా.
తయారీ:
- బీరకాయ చెక్కుతీసి ముక్కలు తరగాలి. ఉల్లిపాయ, టొమాటోలను సన్నటి ముక్కలుగా తరగాలి.
- గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆవాలు చిటపటమంటున్నప్పుడు మినపప్పు, శెనగపప్పు, ఎండుమిర్చిలు వేయాలి.
- పప్పులు ఎర్రగా అవుతున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఆ తరువాత బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు వేసి బీరకాయ ముక్కలు ఉడికాక అన్నం వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి గిన్నె దింపేయాలి.