బాస్మతి రైస్ - 2 కప్పులు
మష్రుమ్స్ - 100 గ్రా.
ఆలివ్ నూనె - 2 టీస్పూన్లు
అల్లం - అంగుళం ముక్క
వెల్లుల్లి - 3 రేకులు
ఉల్లికాడ తరుగు - అరకప్పు
క్యాప్సికం - సగం ముక్క
సోయా సాస్ - 2 టీస్పూన్లు
వెనిగర్ - 1 టీస్పూన్
మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రుమ్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి.ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి 2 నిముషాలు తర్వాత క్యాప్సికం, మష్రుమ్స్ తరిగి కలిపి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు సోయాసాస్, వెనిగర్ కలిపి ఇంకో నిమిషంపాటు వేయించాలి. తర్వాత అన్నం కలిపి (పెద్ద మంటపై) 2 నిముషాలు కలపాలి. మిరియాల పొడి వేసి మరోసారి కలిపి వేడివేడిగా తినాలి.గోబీ మంచిరియాతో మంచి కాంబినేషన్.