చెక్కు తీసిన మామిడి పండు ముక్కలు : రెండు కప్పులు
కొబ్బరి నీళ్ళు : ఎనిమిది కప్పులు
యాలకుల పొడి : చిటికెడు
క్రష్డ్ ఐస్ : ఒక కప్పు
పటిక బెల్లం : చెంచెడు
తయారుచేసే పద్దతి :
ముందుగా మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి . అందులోనే , ఇంతకుమునుపే పొడి చేసిన యాలకుల పొడి మరియు క్రష్డ్ ఐస్ వేయాలి . దాంట్లో కొబ్బరి నీళ్ళలో కరిగించిన పటిక బెల్లం నీళ్ళను పోసి మరోసారి గ్రైండ్ చేయాలి. మనకు కావాల్సిన మామిడి పండ్ల రసం రెడీ ........
మూలం: నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం