తాజా గులాభీ రేకులు - ఒకటిన్నర కప్పులు
పంచదార - ముప్పావుకప్పు
నిమ్మరసం - పావుకప్పు
దానిమ్మ గింజల రసం - ముప్పావుకప్పు
చల్లని నీళ్ళు - 5 కప్పులు
మరిగించిన నీళ్ళు - ముప్పావు కప్పు
యాలకుల గింజలు- పావుటీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- గులాభీ రేకుల్ని కల్వంలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ ముద్దను ఓ పెద్ద గిన్నెలో వేయాలి. ఇప్పుడు మరిగించిన నీళ్ళు పోయాలి. యాలకుల గింజలు కూడా వేసి మూతపెట్టి ఓ రాత్రంతా ఉండనివ్వాలి. ఉదయాన్నే ఈ గులాభీ నీళ్ళను పలుచని బట్టతో వడగట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి బేసిన్ లో వేడినీళ్ళు పోసి అందులో గులాభీ నీళ్ళు ఉన్న గిన్నెను పెట్టి పంచదార కరిగే వరకు ఉంచాలి. కరిగిన తర్వాత గిన్నెను బయటకు తీసి వడగట్టి చల్లారనివ్వాలి. తరువాత దీనికి నిమ్మరసం,దానిమ్మ రసం కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తాగే ముందు బయటకి తీసి చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం