బాస్మతి రైస్-2 కప్పులు
పన్నీర్-200గ్రా (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా పుదీనా-ఒక కట్ట
ఉల్లిపాయలు-2 (సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి-4, అల్లం-చిన్నముక్క
వెల్లుల్లిపాయలు-4, చెక్క-చిన్నముక్క
ఉప్పు-రుచికి సరిపడా, నూనె-రెండు చెంచాలు
నీళ్లు-4 కప్పులు
తయారుచేసే విధానం
- ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి. తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్ చేయాలి. అంతే పుదీనా పన్నీర్ పలావ్ రెడీ.