అన్నం- 2 కప్పులు
ఉప్పు- తగినంత
పొడి:
పల్లీలు- 4 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 3
నువ్వులు- 2 టి.స్పూన్
కొబ్బరిముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
పోపు:
నూనె - 2 టి.స్పూన్
ఆవాలు, జీలకర్ర- 1/4 టి.స్పూన్
మినప్పప్పు- 1 టి.స్పూన్
శనగ పప్పు- 2 టి.స్పూన్
కరివేపాకు- 1 రెబ్బ
కొత్తిమీర - కొద్దిగా
ఇలా చేయాలి
- అన్నం పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి.
- మిగిలిపోయిన అన్నంతోకూడా దీన్ని చేసుకోవచ్చు.
- బాణలి వేడిచేసి పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి.
- వెడల్పాటి పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక అన్నం వేసి కలపాలి.
- ఇందులో పల్లీ మసాలా పొడి, తగినంత ఉప్పువేసి కలుపుతూ వేపాలి. బాగావేగిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసి వేడిగా సర్వ్ చేయాలి.